ఒక అనామక కవి


Cover Image for ఒక అనామక కవి

ఈ సాహిత్యపు ఆసక్తిని నాకు నేర్పలేదు ఏ బడి ,

రాతిరి అయిందంటే చాలు ముంచుకొస్తుంది ఆలోచనల సుడి ,

ఏదో ఇంకేదో రాయాలని ఉన్నా సాహిత్య సాయం చేసే మనిషేడి,

నా అర్థం లేని రాతలకు ఏ రోజూ రాలేదు రూపాయి రాబడి ,

నేనూ నా కవితా ఎప్పుడగునో మంచి జోడి,

నాకా నమ్మకం ఎప్పుడో పోయింది తిరగబడి ,

ఎందుకంటే నేనుండనుగా నా మాట మీద నిలబడి,

దీనికి కారణం నా మస్తిష్కపు యోచనల్లో ఉన్న చిత్తడి,

ఏ రోజైనా నా చిత్తం ఒక దగ్గరుంటేగా, అదే నా జీవితంలో కొరవడి,

ఇలా అలోచించి చించీ అవుతున్నాయి నా రోజులు పొడి పొడి,

ఇలాగే రాయలేక'పోతానేమో' వయసు మీద పడి ,

నే పోయాక కలమూ కాగితమూ పెడతాయేమో కంటతడి,

బాధపడేదేముంది ...అయినా ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో రాస్తాలే బోడి,

ఇదే నా చివరి వ్యాక్యం, ఇక ఉంటా నా మాటకు కట్టుబడి 🙏🏻


అభిప్రాయాలు :


    మరిన్ని...

    మొత్తం - 13
    మరిన్ని...(2)