ఎన్ని గంటలు చదివామన్నది కాదు


Cover Image for ఎన్ని గంటలు చదివామన్నది కాదు

బిట్స్ పిలానీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్లో 7.63 సీజీపీఏ. క్యాంపస్ ప్లేసెమెంట్ లో మంచి ఉద్యోగం . కొంచం కష్టపడితే లైఫ్ సెటిల్ . కానీ అనుదీప్ సివిల్స్ లో మంచి రాంక్ సాధించి దేశానికి సేవ చేయాలని వచ్చిన ఆలోచనను మార్చుకోకుండా కష్టపడి దేశం లో నే టాపర్ గా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నాడు .

తెలంగాణ లో జగిత్యాల జిల్లా లో మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ కి సివిల్స్ రాసిన మొదటి సారేమి మొదటి రాంక్ రాలేదు . 3,4 సార్లు ఫెయిల్ అయినా పట్టుదల , కృషి తో ఐదోసారి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది.

ఎన్ని గంటలు చదివామన్నది కాదు. ఎంత నాణ్యతతో చదివామన్నది ముఖ్యం. హార్డ్‌వర్క్ కన్నా స్మార్ట్‌వర్క్ ప్రధానం. అపజయాలు వెంటాడినా లక్ష్యాన్ని మరువద్దు. దీనికి నా ప్రయాణమే ఒక ఉదాహరణ. అపజయాలను జీవితంలో భాగంగా స్వీకరించాలి. ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి.

అనుదీప్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=fZ_AFUSsNjw&feature=youtu.be

మొదటి ప్రయత్నంలో (2011) విజయం సాధిస్తానని భావించారు. కానీ అపజయం ఎదురైంది. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్ కంపెనీలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించారు. 2012లో ర్యాంక్ సాధించలేదు. 2013లో 790 ర్యాంక్ సాధించారు. దీంతో ఐఆర్‌ఎస్ వచ్చింది. సర్వీస్‌లో జాయిన్ అయ్యారు. కానీ ఐఏఎస్ సాధించాలనే లక్ష్యం మాత్రం విడువలేదు. ఉద్యోగం చేసుకుంటూనే మూడు, నాలుగు ప్రయత్నాలు చేశారు. కనీసం మెయిన్స్ కూడా దాటలేదు. అయినా అధైర్యపడలేదు. లక్ష్యం మరువలేదు. ఈసారి అయిదో ప్రయత్నంలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి తల్లిదండ్రుల కోరిక, తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. రాష్ట్ర ఖ్యాతిని దేశమంతా చాటారు. ప్రస్తుతం హైదరాబాద్ జీఎస్‌టీ, కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ అపూర్వ విజయం సాధించడం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

సరైన అవగాహన, ప్రణాళిక ఉంటే కోచింగ్‌కు వెళ్లకున్నా విజయం సాధించవచ్చు. సాంకేతికత అందుబాటులో ఉన్న నేడు ప్రతి విషయం ఇంటర్నెట్‌లో లభ్యమవుతుంది. శిక్షణ వల్ల కేవలం గైడెన్స్ లభిస్తుంది. కానీ చేయాల్సిన కృషి అంతా అభ్యర్థుల మీదే ఆధారపడి ఉంటుంది.

అనుదీప్ ఇంటర్వూస్ లో నన్ను inspire చేసిన కొన్ని విషయాలు:

  • గూగుల్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు నా వర్క్ వాళ్ళ క్లైంట్స్ కి ఎంతో హెల్ప్ అయ్యేది . అదే గవర్నమెంట్ లో ఉంటె ప్రజలకు ఎంత సేవ చేయొచ్చు అనిపించి వొదిలేసి జాబ్స్ కి ప్రిపేర్ అయ్యా .
  • ఈ రాంక్ అంత ఈజీ గ రాలేదు. ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి, ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకుంటే గాని మనం అనుకున్న స్థాయికి వెళ్లలేం .
  • రాంక్ లు ఒక పార్ట్ మాత్రమే , ఎంత కష్టపడ్డాం ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అన్నదే ప్రధానం .
  • నేనూ ఒక యావరేజ్ స్టూడెంట్ నే. కానీ కృషి పట్టుదల తో నే ఏదైనా సాధ్యం . నేను స్పెషల్ పర్సన్ ఏమి కాదు కానీ నమ్మకం తో నే స్పెషల్ స్థాయికి చేరొచ్చు .
  • మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్ , ప్రతి రోజూ రైతు లను కలుస్తూ ఉంటాడు. ఎదుటివాళ్ళకు ఏదైనా చేయాలనే ఆ తపనే నన్ను ఆలోచింపచేసింది .
  • నా కన్నా ముందు ఎంతో మంది చిన్న స్థాయి నుండి వచ్చి మంచి రాంక్ లు సాధించారు, వాల్లే చేయగా లేనిదీ నేను ఎందుకు చేయలేను, నేనే చేయగా లేనిది మీరు ఎందుకు చేయలేరు ?
  • అందరూ ఫెయిల్ అవుతారు . నిరాశ పడతారు. నిరాశను అలాగే వొదిలేయకుండా, దాని నుండి ఏదైనా నేర్చుకుని ముందుకు వెళ్లడం లోనే జీవితానికి అర్థం ఉంది .
  • నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది కాదు, మన మీద మనకు నమ్మకమే ముఖ్యం .
  • competetive exam ప్రిపేర్ అయ్యే ప్రతి ఒకరు అర్థం చేస్కోవాలిసింది ఏంటి అంటే, అందరికి ప్రెషర్ ఉంటుంది, కానీ ప్లానింగ్ , స్ట్రాటజీ, హార్డ్ వర్క్ , టైం మానేజ్మెంట్ తో మన గమ్యాన్ని చేరుకోవచ్చు .
  • ప్రతి ఒక్కరికి చదువు ఇంపార్టెంట్ . విద్య రంగానికి నా వంతు ఏదైనా చేయాలనేది నా కోరిక .
  • తెలంగాణ ఒక కొత్త రాష్ట్రము . ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రానికి దేశం లో నే ఒక ఐకాన్ గ ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . అందులో నాది కూడా ఒక పాత్ర ఉండాలని కోరుకునే నా మొదటి ఆప్షన్ గ తెలంగాణ ని ఎంచుకున్నా.

దురిశెట్టి అనుదీప్ ఒక్కడే కాదు ఎంతో మంది , కృషి పట్టుదల తో మంచి ర్యాంకులు సాధించారు . ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని కొంత మందైనా పైకొస్తే సివిల్స్ సార్ధకమే !

నోట్ : అనుదీప్ సొంత ఊరైన మెట్టుపల్లి కి చెందిన వాడినే నేను కూడా . కానీ కేవలం తాను మా ఊరు అవడం వల్ల నేను ఫీల్ అయ్యే గొప్పతనం ఏమి లేదు . అది కేవలం excitement , ఉత్సాహం మాత్రమే. ఒక గొప్ప వ్యక్తి ని , గొప్ప స్థాయిని , గొప్ప అఛీవ్మెంట్ ని అభినందించాలి అంటే వాళ్ళు మన వాళ్ళే అవనవసరం లేదు .

అభిప్రాయాలు :


    మరిన్ని...

    మొత్తం - 13
    మరిన్ని...(2)