బాహుబలి
ఇప్పటికే చాలా రివ్యూ లు చాలా మంది రాసారు . అందుకే స్పెషల్ గా రివ్యూ అంటూ ఏది రాయట్లేదు . కాని , నాకు చాలా నచ్చిన కొన్ని పాయింట్స్ మాత్రం రాయాలని అనిపించింది .
రాజమౌళి ఊహా శక్తి కి జోహార్లు .. గొప్ప గొప్ప డైరెక్టర్ లు గొప్ప గొప్ప రచయితలూ తమ తమ ఊహా శక్తిని పదును పెట్టి కొన్ని అద్భుతమైన కళాఖండాలు మనకు అందించారు . రాజమౌళి కూడా అదే కోవలోకి చెందుతాడు. సినిమాలో మొదటి సీన్ రమ్య కృష్ణ మహేంద్ర బాహుబలి ని నీళ్ళలో తీసుకెళ్లడం , పెద్ద జలపాతాన్ని కూడా కథలో భాగం చేయడం , ఒక రాజ్యాన్ని అంత దగ్గరగా చూపించడం , హీరో ఒక కొండ మీది నుండి ఇంకో కొండ మీదికి బాణం వేసి పైకి వెళ్ళే సీన్ , దొంగ ని పట్టుకునేప్పుడు రానా చేతికి తాడు అందించి దూకడం , యుద్దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం .. ఇవన్నీ రాజమౌళి ఊహా శక్తి కి కొన్ని మచ్చు తునకలు మాత్రమె . తన ఊహా శక్తి కి technicians ప్రతిభను జోడించి ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడం తనకే చెల్లు. రానా కొడుకుని తల నరికి , మొండెం మాత్రమె నడిచే సీన్ నీనైతే ఎక్కడా చూళ్ళేదు .
కీరవాణి సంగీతం అయితే అద్భుతం . background music తో ఒళ్ళు జలదరించింది కొన్ని సీన్స్ లో. రాజుల కాలం నాటి నేటివిటీ ని గుర్తు చేస్తూ , ధీరత్వాన్ని , పౌరుషత్వాన్నీ ప్రతిబింబించేలా ఉంది . రానా , అనుష్క ల introduction సీన్ ల లో వచ్చే background మ్యూజిక్ అద్భుథహ .
ఇక పాత్రల విషయాలకు వస్తే , ప్రభాస్ , రానా , రమ్య కృష్ణ , అనుష్క , సత్య రాజ్ , నాజర్ ఏ మాత్రం సందేహం లేకుండా అన్నీ అవార్డ్స్ కొట్టేస్తారు .
ప్రభాస్ బాహుబలి రోల్ అయితే , ఒక గొప్ప నాయకుడు ఎలా ఉండాలో , ఆపదలో తన టీం ని ఎలా ప్రోత్సహించాలో , ఒక గొప్ప పోరాటం లో ముందుండి ఎలా ఒకరికి దారి చూపాలో అద్భుతంగా తీర్చిదిద్దాడు రాజమౌళి . అలాగే రానా ని , ఒక దుర్యోధనుడి , ఒక రావణాసురుని పాత్ర ఆవహించినట్టు , చెక్కడం జక్కన్న కే సొంతం . రాజ మాత అని చందమామ లో చదవడమే కాని , ఇలా ఉంటదా అని రమ్య కృష్ణ ని చూస్తేనే అర్థమైంది . ఆ పాత్ర కోసమే పుట్టిందేమో అనేలా .. అనుష్క పాత్ర నిడివి తక్కువే కానీ , తన ప్రతీకార భావాలతో అందర్నీ కట్టి పడేసింది . ఇక కట్టప్ప సత్య రాజ్ అయితే అంత పెద్ద నటుడైన పాత్రలో కట్టప్పే తప్ప , ఎక్కడా సత్య రాజ్ కనిపించకుండా జీవించాడు .
యుద్ధం జరుగుతున్నప్పుడు స్టేడియం లో కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూసినట్టు , లైవ్ లో చూసిన ఫీలింగ్ . ఏ హాలీవుడ్ మూవీ లో కూడా ఇంత ఎమోషనల్ టచ్ ఉన్న war ని చూళ్ళేదు . ఒక సాధారణ నటుడు ప్రభాకర్ ని , ఒక గొప్ప క్రూర తెగ కు నాయకుడు కాలకేయ గా చూపించడం అనే థాట్ wonder .
నాకు తెలిసి బాహుబలి అనే స్టొరీ మరీ 3 గంటల్లో చెప్పేది కాదు , అలాగని 6 గంటలు మరీ ఎక్కువ . కానీ మన సినిమా 3 గంటలు ఉండాలి కాబట్టి , కొన్ని సీన్స్ అనవసరంగా జొప్పించడం తప్పలేనట్టుంది . ఏది ఏమైనా , బాహుబలి మొదటి భాగం , ఇంటర్వెల్ కు ముందు పార్ట్ లాంటిది . అసలు పార్ట్, క్లైమాక్స్ నెక్స్ట్ పార్ట్ లో అసలు సిసలు రాజమౌళి డ్రీం మనకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను .
ఒక సౌత్ సినిమా గురించి , అందులోనూ , మెగా , సూపర్ , పవర్ , etc స్టార్ లు లేని సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది అంటే ఒక తెలుగు ప్రేక్షకుడిగా గర్వించ దగిన విషయం . రాజమౌళి లాంటి దర్శకుడు దొరకడం మన అదృష్టం. ఇంటర్నేషనల్ మూవీ సైట్స్ సైతం , బాహుబలి గురించి రాస్తున్నయంటే , అందులో ఉన్న గొప్పతనం అర్థం చేస్కుని అభినందిస్తామో , లేదా అనవసర నెగటివ్ పాయింట్స్ వేలెత్తి చూపి మన వాళ్ళను మనమే తీసి పారేస్తామో అన్నది మన సంస్కారానికి వదిలేద్దాం . కాని , అంత visualization ఉన్న డైరెక్టర్ తీసిన visual wonder కి విలువ ఇవ్వడం తెలుగు సినిమా స్థాయి పెరగాలనే ప్రేక్షకుడిగా మన బాద్యత.