మాతృ దినోత్సవం
నేను ఇప్పటి వరకు ఈ భూమండలంపై మా తల్లినిమించిన అందగత్తెను చూడ లేదు.
నేను ఇప్పటి వరకు ఈ భూమి పై మా అమ్మ అంత ఐశ్వర్య వంతురాలిని చూడలేదు .
సంస్కారం తన ఆభరణం ..
ఓర్పు తన పచ్చల హారం ....
తెలివి తేటలు తన ఒడ్డాణం ...
ఆశావాదం తన ముక్కు పుడక ...
అమ్మ ఒక అందమైన రూపం ...
అమ్మ ఒక అద్భుతమైన జ్ఞాపకం ...
అమ్మ ఒక అందమైన లోకం ...
అమ్మలో ఉన్న వైభవం, దివ్యత్వం ప్రపంచంలో ఎవరి వద్దా చూడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను.
మృత్యువు కాటేస్తున్నా మూడు పూటలా గోరు ముద్దలు తినిపించి,
మూడు నెలల్లోనే సుదూర తీరాలకు చేరిన మా అమ్మను తలుచుకుంటూ ,
కమ్మని 'అమ్మల దినోత్సవం' రోజున ,
నేపాల్ భూకంపం లో ,
పిల్లలను కోల్పోయిన ,
పిల్లల కోసం ప్రాణాలు అర్పించిన తల్లులకు,
మాతృ దినోత్సవం అంకితం ...